రాష్ట్రంలో పెరిగిన చలిగాలులు
భువనేశ్వర్: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. 23 నగరాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, 38 ప్రదేశాలలో 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం 3 డిగ్రీల సెల్సియస్‌తో జి.ఉదయగిరి అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. తదుపరి చలి ప్రాంతాల జాబితాలో సెమిలిగుడ (4.1 డిగ్రీల సెల్సియస్), ఫుల్బాణి (5 డిగ్రీలు), రూర్కెలా (5.1 డిగ్రీలు), ఝార్సుగూడ (5.4 డిగ్రీలు) ఉన్నాయి. 10 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఇతర నగరాల్లో దారింగ్‌బాడి (7 డిగ్రీలు), కెంజొహర్ (7.6 డిగ్రీలు), సుందర్‌గఢ్, భవానీపట్న (7.8 డిగ్రీలు), అంగుల్ (8 డిగ్రీలు), కొరాపుట్ , బొలంగీర్ (8.5 డిగ్రీలు), కటక్ (9.6 డిగ్రీలు) ఉన్నాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో గజగజలాడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు..
చెరుకు పంట దగ్ధం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి యంవీ 31 గ్రామంలో బుధవారం మధ్యాహ్న సమయంలో ప్రతాప్ బిశ్వాస్ అనే రైతుకు చెందిన చెరుకు పంట అగ్ని ప్రమాదం జరిగి భారీగా నష్టం వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి . వరి కోత అనంతరం ప్రతాప్ తన పొలంలో చెరుకును వేశాడు. అయితే అతని పోలానికి సమీపంలో మరో రైతు తన పొలంలో కారణం లేకుండానే నిప్పు పెట్టాడు. ఈ పంటలు ప్రతాప్ పోలం వైపు వ్యాపించి చెరుకు పంట మొత్తం కాలిపోయింది.విషయం తెలిసిన వేంటనే ప్రతాప్ పోలంకు వచ్చి చూడగా చెరుకు మొత్తం బుడిద అయింది దానితో అగ్నిమాపిక సిబ్బందికు సమాచారం ఇవ్వడం తో వారు ఈ పోలాలుకు మద్య కాలువ ఉండటం తో వహనం చేరుకోలేదు కాని సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు అయిన అప్పటికే పూర్తిగా కాలిపోయింది .1లక్ష 10వేలు ఖర్చు చేశాను అప్పుగా తెచ్చానని.. జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం చేయాలని బాధితుడు కోరారు. సహయం చేయ్యాలి అని కోరారు రైతు ప్రాతాప్ . పంట ఏంత మొత్తం ద్వంశం అయిందో నివేదికను చూసి పరిహరం అందజేస్తాం అని కోరుకొండ అగ్నిమాపిక అధికారి సునీల్ నాయక్ తెలిపారు.
రాష్ట్రంలో పెరిగిన చలిగాలులు


