క్రీడల్లో శిక్షణ అందిస్తాం
● జిల్లా క్రీడాధికారి, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు
పర్లాకిమిడి: మహిళా స్నాతక డిగ్రీ కళాశాలలో బుధవారం వార్షిక క్రీడాపోటీలు జరిగాయి. ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడాధికారి, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. క్రీడా పోటీల్లో మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రీనా సాహు, అధ్యాపకురాలు మధుస్మితా ప్రధాన్, క్రీడా ప్రశిక్షకులు (సెయింట్ జోసఫ్ స్కూల్) సుకుమార్ శథపతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపినవారికి రాష్ట్ర స్థాయి స్పోర్ట్ కాంప్లెక్‌సలో శిక్షణ అందిస్తామన్నారు. లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్, పరుగు పందాలు, జువెలెన్ థ్రో, మ్యూజికల్ చైర్ వంటి క్రీడాంశాల్లో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్లస్ త్రీ విద్యార్థిని ప్రియాంకా జెన్నా చాంపియన్‌షిప్ సాధించింది. కళాశాల సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ భారతి పాణిగ్రాహి అతిధి పరిచయం చేయగా, స్పోర్ట్ ప్రశిక్షకురాలు బరోదా ఆచార్య ధన్యవాదాలు తెలిపారు.
క్రీడల్లో శిక్షణ అందిస్తాం
క్రీడల్లో శిక్షణ అందిస్తాం


