బీజేపీని బలోపేతం చేయాలి
రాయగడ: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ అన్నారు. జిల్లాలోని కాసీపూర్ సమితి గోరఖపూర్‌లో కార్యకర్తలతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు గురించి అందరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి సమావేశంలో కార్యకర్తలతో చర్చించారు.
సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు బసంత ఉలక, రజత్ మదల, యాల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని బలోపేతం చేయాలి


