అయ్యప్ప సన్నిధానంకు వితరణ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రానికి చెందిన ఇటీవల మాల విరమించిన అయ్యప్ప స్వాములు డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని నబరంగ్‌పూర్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయ్యప్ప దీక్షా సమయంలో స్వాములు బస చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. పపడాహండిలో ఉన్న తమ సన్నిధానం నిర్మాణానికి సాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన కోటా నిధుల నుంచి రు.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలిసినవారిలో గురుస్వామి కృష్ణ ప్రధాన్, నరేష్ స్వామి తదితరులు ఉన్నారు.


