ఏనుగు దాడిలో బాలుడు మృతి
రాయగడ: రాయగడ, కలహండి జిల్లా సరిహద్దు ప్రాంతమైన లంజిగడ్ అటవీ ప్రాంతంలో ఏనుగు దాడి చేసిన ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన బాలుడు రవిమఝి (5)గా గుర్తించగా గాయాలు పాలైన బాలుడు సంబారు మఝిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఇరు జిల్లాల అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొగా గాయాలుపాలైన సంబారును సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లా త్రిలోచనపూర్ పంచాయతీలోని కునాకాడు గ్రామానికి చెందిన కన్ను మాఝికి చెందిన రవి, సంబారులు సమీపంలో తమ పంట పొలాలకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఏనుగు వారిపై దాడి చేసింది. రవిని ఏనుగు తొండాంతో విసిరిపారేయగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదేవిధంగా సంబారును ఏనుగు గాయపరిచింది. సమాచారం తెలుసుకున్న లంజిగడ్ బీడీవో అమీన్ ప్రధాన్, విశ్వనాత్‌పూర్ అటవీ శాఖ రేంజర్ నరోత్తమ్ మాఝిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు.
మరొకరికి గాయాలు
ఏనుగు దాడిలో బాలుడు మృతి


