బ్రిటిష్ వంతెనను సంరక్షించండి
కొరాపుట్: శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ వంతెనను సంరక్షించాలని నబరంగ్‌పూర్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఐకాన్ ఇన్ మొషన్స్ యువజన సంస్థ ప్రతినిధి రణేంద్ర ప్రతాప్ త్రిపాఠి ఒక ప్రకటనలో మాట్లాడారు. బ్రిటిష్ పాలనా సమయంలో ఇంద్రావతి నదిపై 1909 లో వంతెన నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రాన్సిస్ మెర్టాన్ సంస్థ దీని నిర్మాణం 1917 లో పూర్తి చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ వంతెన కొరాపుట్–నబరంగ్‌పూర్ జిల్లాల వాసుల ప్రజలలో కొన్ని తరాలకు గుర్తుగా ఉందన్నారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని, దీన్ని సంరక్షించి పర్యాటక స్థలంగా మార్చాలని డిమాండ్ చేశారు. తాము ఇది వరకే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్య వంశీ, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలు సమర్పించామన్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం భావి తరాలకు ఒక స్మృతిగా ఈ బ్రిటిష్ వంతెన చూపాలని రణేంద్ర విజ్ఞప్తి చేశారు.
బ్రిటిష్ వంతెనను సంరక్షించండి
బ్రిటిష్ వంతెనను సంరక్షించండి


