బీడీఓ ఇంట్లో చోరీ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళ వారం నబరంగ్‌పూర్ బీడీవో సునీల్ ఖొర ఇంట్లో చోరీ జరిగింది. వరుసగా రెండు రోజుల సెలవు కారణంతో బీడీవో రాయగడ జిల్లాలోని స్వస్థలానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు టయలెట్ వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. హాల్‌లో బీరువా పగలుగొట్టి అందులో రు. 20 వేలు అపహరించుకుపోయారు. ఉదయం ఇంటికి వచ్చిన బీడీవో ఖంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ప్రభుత్వ క్వాటర్లో చోరీ జరగడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. పోలీసులు క్లూస్ టీం తెచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. వారం రోజుల క్రితం ఒక జిల్లాస్థాయి ఉన్నతాధికారి సెలవుపై వెళ్లినపుడు కూడా అతని ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రభుత్వ అధికారులు సెలవులపై వెళ్లినప్పుడు వారి ప్రభుత్వ గ్రుహాల లక్ష్యం గా దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసుల గమనించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు.
రూ. 20 వేల అపహరణ
బీడీఓ ఇంట్లో చోరీ
బీడీఓ ఇంట్లో చోరీ
బీడీఓ ఇంట్లో చోరీ


