వినతుల వెల్లువ
పర్లాకిమిడి: కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన గ్రీవెన్సు సెల్‌కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ మధుమిత, ఎస్పీ జ్యోతంద్ర పండా, జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహక అధికారి శంకర కెరకెటా తదితరులు వినతులు స్వీకరించారు. రాణిపేట, పర్లాకిమిడి పురపాలక సంఘం, సిద్ధమణుగు, జాజిపూర్ గ్రామ పంచాయతీల నుంచి 79 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 62, గ్రామ సమస్యలకు సంబంధించినవి 17 ఉన్నాయి. సకాలంలో వినతులను వివిధ శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మ ప్రాంతంలో ఏకలవ్య మోడల్ స్కూల్ తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతిని అందజేశారు. 2024–25 విద్యా సంవంత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ పాఠశాల బిల్డింగ్ నిర్మాణం పనులు పూర్తి కాలేదన్న సాకుతో పాఠశాల తెరవలేదని, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్య క్రమంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని బీడీవో గౌరచంద్ర పట్నాయిక్, తహసీల్దార్ నారాయణ బెహర తదితరులు పాల్గొన్నారు.
తల్లీ కూతుళ్లపై అత్యాచారయత్నం
భువనేశ్వర్: స్థానిక బరముండా బస్టాండ్‌లో నిద్రిస్తున్న తల్లీ, కూతుళ్లపై అత్యాచారయత్నం సంచలనం సృష్టించింది. ఈ మేరకు దాఖలైన ఫిర్యాదు ఆధారంగా భరత్‌పూర్ ఠాణా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు గంజాంలోని బెగుణియాపొడాకు చెందిన పబిత్ర కొంహరొగా గుర్తించారు. ఈ ఘటనపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
ఏసీఏ నూతన కార్యవర్గం నియామకం
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి (ఏసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కళ లు, సంస్కృతి, తెలుగు సంప్రదాయ విలువల పరిరక్షణ పట్ల ఔత్సాహికులకు కార్యవర్గంలో చోటు కల్పించారు. నలుగురు మహిళలు కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులయ్యారు. అధ్యక్షుడుగా జి.ఆనందరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కె.పి.ఈమని, ఉపాధ్యక్షుడు, సీహెచ్ జగదీష్, కార్యదర్శిగా ఆర్. సత్యసాయి, సంయుక్త కార్యదర్శులుగా వి. శ్రీనివాస్, టి.ఎన్.చంద్రశేఖర్, కోశాధికారిగా ఎ.నాగరాజు, కార్యనిర్వాహక సభ్యులుగా జి.యోగేశ్వరరావు, జి.అపన్న, డి.రవిశంకర్, సాకా శ్రీధర్, బి.రమే ష్, పి.కామేశ్వరరావు, సి.బి.భారతి, ఎం.అరుణ, కె.నీరజ, జి.త్రిపుర, ఆడిటర్‌గా టి.ప్రకాశరావు నియమితులయ్యారు.
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
రాయగడ: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యు వకుడు దుర్మరణం చెందాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పూజారిగుడ నుంచి జగన్నాధపూర్‌కు వెళ్లే రహదారి వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రాజ నల్ల (18)గా గుర్తించారు. సమాచా రం తెలుసుకున్న కళ్యాణసింగుపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రాజ నల్ల బైక్‌పై సమీపంలోని బిన్నీస్‌పూర్ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలకు గురైన రాజను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ


