కొరాపుట్: పార్లమెంట్ సభ్యునిగా తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం ఏర్పిడిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. శుక్ర వారం భారత పార్లమెంట్‌కి ఫిర్యాదు అందించారు. ఈ నెల 26వ తేదీన తాను ఒడిశాలోని భువనేశ్వర్‌లో అసెంబ్లీకి వెళ్తుండగా రిజర్వ్ ఆఫీసు వద్ద ముడు గంటల పాటు పోలీసులు దిగ్బంధించారన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడినని, తాను అసెంబ్లీకి వెళ్లడానికి అన్ని హక్కులు ఉన్నాయని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదన్నారు. ఇవి గౌరవ పార్లమెంట్ సభ్యునికి జరిగిన హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఆర్టికల్ 105, రూల్ 222 ప్రకారం ఇది ఎంతో నేరంగా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ఒడిశా భుబనేశ్వర్ డిసిపిలపై చర్యలు తీసుకోవాలని సప్తగిరి ఉల్క విజ్ఞప్తి చేసారు.


