మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి ఎంవీ 23 గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను జిల్లా అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని శ్రీనివాస్ బేపారి అనే వ్యక్తి ఇంట్లో కలప ఉన్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అటవీ అధికారుల బృందం మంగళవారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేశారు. వీరి రాకతో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ పరారయ్యాడు. దీంతో నిల్వ ఉంచిన రూ.లక్షలు విలువజేసే కలప స్వాధీనం చేసుకున్నారు. దాడిలో రేంజర్ రమేష్ చంద్ర రౌత్, ఫారెస్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.