పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ–ఆఫీస్ శిక్షణ తరగతులు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. డిజిటల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్రియాశీల, సరళీకృత, పారదర్శకత విధానంపై అవగాహనకు ఉద్యోగులు శిక్షణలో పాల్గొనాలని కోరారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన శిక్షకులు దీపక్ కుమార్ మల్లిక్, కవితారాణి రౌతో ఈ–ఆఫీస్ పని విధానాన్ని తెలియజేశారు. ఈ తరగతులు ఈనెల 28 వరకు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో, ఎన్‌ఐసీ జిల్లా అధికారి టి.బాలకృష్ణ మూర్తి, ఎన్‌ఐసీ డీఐవో రాజా ఆనంద్, సీఎంజీఐ కో–ఆర్డినేటర్ ప్రశాంత కుమార్ సాహు పాల్గొన్నారు.
జగన్నాథుని సన్నిధిలో జస్టిస్ హరీష్ టండన్
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయాన్ని జస్టిస్ హరీష్ టండన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజార్చనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక రోజు ముందుగా శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్ర హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టండన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఉద్యోగులకు శిక్షణ తరగతులు