ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: గజపతి చాంబర్ ఆఫ్ కామర్స్ బృందం నూతనంగా ఎన్నికై న పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహిని ఆదివారం హైటెక్ ప్లాజాలో కలిసి అభినందనలు తెలియజేశారు. గజపతి చాంబర్స్ కామర్స్ అధ్యక్షుడు పొట్నూరు రామకృష్ణ, పైడిశెట్టి సుధ, అంధవరపు బాలాజీ, పొట్నూరు హరి, జామి సోమేశ్వరరావు, మహేష్ తదితరులు మాట్లాడుతూ పర్లాకిమిడిలో గజపతి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నిర్మించడానికి స్థలం కేటాయించాని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment