
చురుగ్గా జగన్నాథ రథ నిర్మాణాలు
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరి దివ్య ధామంగా పిలిచే కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి శ్రీజగన్నాథ క్షేత్రం వద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిమిలిగుడ రోడ్డు దేవదాయ శాఖ అధికారులు ఇటీవలే ప్రారంభ పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సవరలు పూజించే జగన్నాథుడు కనుక శబర శ్రీక్షేత్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కొరాపుట్‌లో జగన్నాథుడు, బలబద్ర, సుభద్రలకు ప్రత్యేక రథాలు ఉంటాయి. సుభద్ర రథాన్ని మహిళ లు లాగుతూ గుండిచా మందిరం వరకు తోడ్కొని వెళ్తారు. జూలై 7న జరిగే రథయాత్రకు అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.