Hyderabad: పెళ్లై తొమ్మిది నెలలు.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు | - | Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్లై తొమ్మిది నెలలు.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు

Jun 15 2023 9:14 AM | Updated on Jun 15 2023 9:33 AM

- - Sakshi

హైదరాబాద్‌లోని అన్నాజిగూడ లో అద్దెకు ఉండేవారు. భర్త రవితేజ అదనపు కట్నం తేవాలని, నిత్యం భార్యను హింసించేవాడు.

ఒడిశా: అదనపు కట్నం కోసం భర్త తన భార్యను వేధిస్తున్న సంఘటన పార్వతీపురం పట్టణంలో వెలుగుచూసింది. ఈ మేరకు పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్ట్‌ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణానికి చెందిన గుడ్ల శ్రావణికి రవితేజతో వివాహమై తొమ్మిదినెలలవు తోంది.

వివాహ సమయంలో 14తులాల బంగారం రెండు లక్షల నగదు, పెండ్లి కుమారుడికి బ్రాస్‌లెట్‌ శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చారు. వివాహమైన తరువాత భార్యభర్తలు హైదరాబాద్‌లోని అన్నాజిగూడ లో అద్దెకు ఉండేవారు. భర్త రవితేజ అదనపు కట్నం తేవాలని, నిత్యం భార్యను హింసించేవాడు. ఈ విషయం పెద్దల సమక్షంలో రెండుసార్లు చర్చలు జరిపి రాజీ చేశారు.

అయినా భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మళ్లీ భార్యను కొట్టి హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె హైదరాబాద్‌నుంచి పార్వతీపురం కన్నవారింటికి వచ్చి తీవ్ర అనారోగ్యం కారణంగా పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement