చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులను వదిలేసి, దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 43వ డివిజన్ టీడీపీ నాయకులు కేఎల్‌రావు నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతో వైఎస్సార్ సీపీ నేతలు పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున గుమిగూడటంతో పెట్రోలింగ్‌లో ఉన్న సీఐ, వైఎస్సార్‌సీపీ నాయకులు కర్నాటి రాంబాబు, గంటిగంపు వెంకట్‌లను స్టేషన్‌కు రావాలని బెదిరించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వారిని వదిలేసి, వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించడం ఏంటని మహిళలు నిలదీయడంతో పోలీసులు అక్కడ నుంచి జారుకున్నారు.


