విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 ముగిసిన మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నందిగామలో 72.67 శాతం

న్యూస్‌రీల్‌

బెజవాడలో తగ్గిన ఓటింగ్‌ శాతం 55.35 శాతానికే పోలింగ్‌ పరిమితం 21 వార్డుల్లో 50 శాతం కూడా దాటని పోలింగ్‌ మిగిలిన మునిసిపాలిటీల్లో ఉధృతంగా ఓటింగ్‌ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్న కూటమి నాయకులు

కొండపల్లిలో 72.09 శాతం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
ముగిసిన మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌

9

కొండపల్లి పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది

నందిగామ పట్టణంలో 32 వార్డులకు గాను 72.67 శాతం పోలింగ్‌ నమోదైంది. పట్టణంలోని ఎనిమిది, తొమ్మిదో వార్డులతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వార్డుల్లో దొంగ ఓట్లు వేయించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న శాసన మండలి సభ్యుడు డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని 14, 15 వార్డులకు సంబంధించిన బూత్‌లలో అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేశారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: చెదురు మదురు ఘటనల మధ్య ఎన్టీఆర్‌ జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఆదివారం సెలవు అయినా విజయవాడ నగర ప్రజలు ఓటింగ్‌కు రావడానికి ఇష్టపడలేదు. దీంతో ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. మొత్తం 8,05,804 మంది ఓటర్లు ఉండగా రాత్రి 9.30 గంటల సమయానికి 55.35 శాతం మంది ఓటు వేశారని అధికారులు నిర్ధారించారు. ఎన్నికలు ప్రారంభయ్యేవరకూ నగదు పంపిణీలో బిజీగా ఉన్న కూటమి నాయకులు, పోలింగ్‌ ప్రారంభం అయిన తర్వాత యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్‌ సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడక్కడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 86వ వార్డులో అత్యధికంగా 71.93 శాతం పోలింగ్‌ నమోదైంది. 55వ వార్డులో 60.74 శాతం ఓటింగ్‌ మాత్రమే జరిగింది. 83, 85వ వార్డుల్లో 64.70 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. 26వ వార్డు 65.25 శాతం, 46వ వార్డు 62.11 శాతం నమోదైంది. నగరంలోని మొత్తం 86 వార్డులకు 21 వార్డుల్లో 50 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాలేదు. మరో 22 వార్డుల్లో మాత్రమే 60 శాతానికి మించి ఓటింగ్‌ జరిగింది. మిగిలిన వార్డుల్లోనూ పోలింగ్‌ 50 నుంచి 60 శాతం మధ్యనే ఉంది. మొత్తం 8,05,797 మంది ఓటర్లలో 4,46,021 మంది మాత్రమే ఓటేశారు.

జగ్గయ్యపేటలో 72.99 శాతం పోలింగ్‌

జగ్గయ్యపేటలోని 36 వార్డుల్లో ఆదివారం జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ 72.99 శాతంగా నమోదైంది. మొత్తం 43,935 మంది ఓటర్లు ఉండగా 32,038 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 22వ వార్డులో అత్యధికంగా 87.05 శాతం, ఐదో వార్డులో అత్యల్పంగా 56.56 శాతం పోలింగ్‌ నమోదైంది.

తిరువూరులో 73.81 శాతం పోలింగ్‌

తిరువూరు పట్టణంలో 73.81 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థుల ప్రధాన పోలింగ్‌ ఏజెంట్ల పాసులు, మీడియా పేరుతో పాసులు పొందిన పలువురు టీడీపీ నేతలు కీలకమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద తిష్టవేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా బయటికి వెళ్లకుండా అధికారులకు తల నొప్పిగా మారారు. పోలీసు ఉన్నతాధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులను, సామాన్య ఓటర్లను బలవంతంగా బయటికి పంపి, టీడీపీ నేతలను మాత్రం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.

కొండపల్లి మునిసిపాలిటీలో పోలింగ్‌ ముగిసే సమయానికి 72.09 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఉదయం నుంచి పోలింగ్‌ మందకొడిగా జరిగింది. 11వ వార్డులో పోలింగ్‌ కేంద్రం బయట అభ్యర్థుల పేర్లు పక్కన సింబల్‌ గుర్తులు వేయలేదని ఇండిపెం డెంట్‌ అభ్యర్థి కలకంటి బసవయ్య అధికారులను ప్రశ్నించారు. దీంతో వివాదం ముదరడంతో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. 30వ వార్డులో బ్యాలెట్‌ పేపర్లు వ్యతిరేక దిశలో అధికారులు మడత పెట్టడంతో ఓటర్లు సుమారు 250 మంది వరకు రివర్స్‌లో మడతపెట్టి ఓటు వేశారు. ఒకరు గుర్తించడంతో అధికారుల వైఫల్యం బయట పడింది. 38వ వార్డులో జనసేన నాయకులు ఓటేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్న వారికి నగదు పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. వారిని స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement