పోలింగ్‌ సరళి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సరళి పరిశీలన

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ నగరపాలక సంస్థతో పాటు కొండపల్లి, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. విజయవాడలోని కేబీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఆక్ప్‌ఫర్డ్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని, కొండపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ అదేవిధంగా పోలింగ్‌ అనంతరం కీలకపాత్ర పోషించే రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్‌ సామగ్రి స్వీకరణ, భద్రపరిచే విధానం, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అవసరమైన మౌలిక ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ నాగలక్ష్మి.ఎస్‌ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నందిగామ పరిధిలోని అనాసాగరం జెడ్పీ హై స్కూల్‌, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రం, ఓట్ల లెక్కింపు హాల్‌ను సందర్శించారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట నందిగా మున్సిపల్‌ కమిషనర్‌ జి.లోవరాజు, కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement