సమన్వయంతో మునిసి‘పోల్స్‌’ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో మునిసి‘పోల్స్‌’ నిర్వహణ

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

పోలింగ్‌ను క్షేత్రస్థాయి పరిశీలించిన కలెక్టర్‌ లక్ష్మీశ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉద్యోగుల సమన్వయం, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి నిర్వహించామని కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి మునిసి పాలిటీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్‌ లక్ష్మీశశ 22వ వార్డు పోలింగ్‌ కేంద్రం, కొండపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ ప్రక్రియ, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్‌ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్‌ సామగ్రి స్వీకరణ, భద్రపరిచే విధానం, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు పరిశీలించారు.

ఆర్డీఓ, జిల్లా అబ్జర్వర్‌ పరిశీలన..

ఎన్నికల జిల్లా పరిశీలకురాలు, జెన్‌కో ఎండీ నాగ లక్ష్మి, ఆర్డీఓ వెన్నెల శ్రీనివాసరావు స్థానిక 36, 37, 14, 15, 16 వార్డులను సందర్శించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు. ఆర్వో రామకృష్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ బి. శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement