వెతలే.. వేతనాల్లేవ్! 11 నెలలుగా జీతాలివ్వని చంద్రబాబు సర్కారు మచిలీపట్నంఅర్బన్: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సర్వజన ప్రభుత్వ ఆస్పత్రులలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 76 మంది సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు గత 11 నెలలుగా జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. విధులు మాత్రం నిరంతరం చేయించుకుంటూ, వేతనాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఆప్కోస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ వ్యవస్థను క్రమంగా బలహీనపరుస్తూ, ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, వేతనాల హామీ, సేవా నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో సిబ్బందిలో తీవ్ర అనిశ్చితి నెలకొంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీ చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ నిర్వహించారు. 2024 డిసెంబర్ 21న విడుదల చేసిన కంబైన్డ్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 142 పోస్టులను భర్తీ చేశారు. వీటిలో 66 కాంట్రాక్ట్ పోస్టులు, 76 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.
2025 జూలై నుంచి ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్క నెల జీతం కూడా అందలేదు. అంతేకాక ఉద్యోగుల పేర్లు అధికారిక జాబితాల్లో సక్రమంగా నమోదు అయ్యాయో లేదో కూడా స్పష్టత లేదు. ఆప్కోస్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వేతనాలు నిలిచిపోయాయని అధికారులు సమాధానం ఇస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
సమస్యపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని, ఆప్కోస్ అధికారులను, మంత్రి కొలుసు పార్థసారథిని పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులను జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని ఆప్కోస్ అధికారులు చెబుతున్నారని తెలిపారు.
ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోంది..
ప్రభుత్వ మెడికల్ కాలేజీ లోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే, కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతోంది. జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులతో విధులు చేయించుకోవడం దారుణం. ఉద్యోగుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ప్రభుత్వం సాంకేతిక సమస్యల పేరుతో కాలయాపన చేయడం సరికాదు.
బందరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన 2025 జూలై నుంచి ఒక్క నెల వేతనం కూడా చెల్లించని వైనం ఆప్కోస్ వ్యవస్థను బలహీన పరిచేందుకేనని విమర్శలు
ప్రైవేట్ కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే..
ప్రభుత్వ మెడికల్ కాలేజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆప్కోస్‌ను బలహీనపరుస్తూ, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాంకేతిక సమస్యల పేరుతో వేతనాలు నిలిపివేయడం తప్పించుకునే ప్రయత్నమే.
11 నెలలుగా జీతాలివ్వని చంద్రబాబు సర్కారు
ఆప్కోస్‌పై అనిశ్చితి..
142 పోస్టుల భర్తీ..
గతేడాది జూలై నుంచి బకాయి..
వినతులు ఫలించలేదు..
– లింగం ఫిలిప్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
– ఓఎల్ రావు,
జిల్లా జాయింట్ సెక్రటరీ, ఏఐటీయూసీ