ప్రధానంగా వన్‌టౌన్ ప్రాంతంలో భావన్నారాయణ వీధి, చిట్టూరి కాంప్లెక్స్ మీదుగా బీఆర్‌పీ రోడ్డు ప్రాంతాల్లో రోడ్లకు రెండు వైపులా ఆక్రమణలతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. బ్రాహ్మణ వీధి, శివాలయం వీధి, వన్‌టౌన్ మెయిన్ బజారు, రాంగోపాల్ వీధి, పులిపాటి వారి వీధిలో దుకాణాలు రోడ్లపైకి చొచ్చుకొస్తున్నాయి. వీటి వల్ల ద్విచక్రవాహనాలు ప్రయాణించడమే కాదు పాదచారులు నడిచేందుకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. బీసెంట్ రోడ్డు మొత్తం ఆక్రమణలతో నిండిపోతోంది. రోడ్డుకు రెండు వైపులా బండ్లతోనే నిండి ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో కనీసం రోడ్డుపై నడవాలన్న ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దుకాణాల నిర్వాహకులు, చిరు వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా, రోడ్లపైన పెట్టిన వస్తువులను తొలగిస్తున్నా మార్పు రావటం లేదు.


