చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి త్వరలో చర్యలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి త్వరలో చర్యలు

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

జి.కొండూరు: చిన్ననందిగామ వద్ద కోతుల వాగుపై చెక్‌ డ్యామ్‌ పునర్నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని ఇరిగేషన్‌ ఏఈ టి.రాజేష్‌ తెలిపారు. కోతులవాగుపై చెక్‌ డ్యామ్‌ ధ్వంసమై రైతులు సాగునీటి కోసం నరకయాతన పడుతున్న క్రమంలో ‘చెక్‌ ఢాం.. నీరుగారిన లక్ష్యం’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఇరిగేషన్‌ అధికారులు చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతా మని ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. చెక్‌ డ్యామ్‌ శిథిలావస్థకు చేరడంతో 2018లో పునర్నిర్మాణానికి రూ.315 లక్షలు మంజూరవగా సాంకేతిక సమస్యల వల్ల కాంట్రాక్టరు పనులను ప్రారంభించలేదన్నారు. 2024, 2025 సంవత్సరాల్లో కోతులవా గుకు వచ్చిన వరదతో చెక్‌డ్యామ్‌ ధ్వంసమైందన్నారు. ఈ క్రమంలో నూతన చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం నీటి సంఘం నాయకులు, రైతులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఇదే విషయాన్ని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే విన్నవించారని తెలిపారు. ఆ వెంటనే చెక్‌ డ్యామ్‌ని పరిశీలించి నూతన నిర్మాణం కోసం చర్యలు చేప ట్టాలని మంత్రి సైతం జలవనరుల శాఖ అధికా రులను ఆదేశించారన్నారు. ఈ క్రమంలో చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి సంబంధిత అధికారుల నుంచి డిజైన్‌, డ్రాయింగ్‌ తీసుకొని, ప్రతిపాదనలు పంపి, నూతన నిర్మాణానికి చర్యలు చేపడతా మని ఏఈ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement