స్కూల్‌, కాలేజీ బస్సుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌, కాలేజీ బస్సుల తనిఖీ

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

స్కూల్‌, కాలేజీ బస్సుల తనిఖీ మచిలీపట్నంఅర్బన్‌: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాలల బస్సులను ప్రాంతీయ రవాణా అధికారి షేక్‌ యూసఫ్‌ సలాం ఆధ్వర్యంలో బుధవారం తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా బస్సుల్లో ఉన్న లోపాలను గుర్తించి, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేపట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించారు. లోపాల సవరణకు 14 రోజుల గడువు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో మచిలీపట్నం రవాణా శాఖ మోటార్‌ వెహికల్‌ ఇన్‌ స్పెక్టర్లు బీఎస్‌ఎస్‌ నాయక్‌, ఎండీ ఎల్‌. సిద్ధిక్‌, నారాయణస్వామి పాల్గొన్నారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు గుంటూరు జిల్లా క్రీడాకారులు

చిలకలపూడి(మచిలీపట్నం): దేశవ్యాప్తంగా వివాదాల సామరస్యత, సమాధాన్‌, సమరోహ్‌ అనే పేరుతో సుప్రీంకోర్టులో నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్‌అదాలత్‌ ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలు సామరస్యమైన పరిష్కారం చేయటమే లక్ష్యమన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు చురుకుగా పాల్గొనాలని, వివాదాల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కక్షిదారులు లేక న్యాయవాదులు ఈ నెల 31వ తేదీలోగా https://forms. gle/jqxefqF4BCWzukoP6 గూగుల్‌ ఫామ్‌లో కేసు వివరాలను పంపాలన్నారు.

మంగళగిరి టౌన్‌: నేషనల్‌ సబ్‌ జూనియర్‌ అండ్‌ జూనియర్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లిఖిత, విజయశ్రీ, కౌశిక్‌ ఎంపికయ్యారని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ భాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని అసోసియేషన్‌ కార్యాలయంలో బుధవారం క్రీడాకారుల వివరాలు వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా, అమలాపురంలో పోటీలు జరుగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement