తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్‌జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్ బుధవారం సందర్శించారు. వారు విజయ కీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్నవిమోచక హనుమాన్‌ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని బహూకరించారు. వారికి ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు.


