ప్రజల్లో మార్పు రావాలి
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడు రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతాం. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవే. మద్యం తాగి వాహనాలు నడపటం, మితి మీరిన వేగంతో ప్రయాణించడం, సీటు బెల్టు ధరించక పోవడం, హెల్మెట్ వాడకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతు న్నాయి. హెల్మెట్ వాడితే ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణాలను నివారించగలుగుతాం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల మనతో పాటు, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.
– ఆర్.ప్రవీణ్, ఆర్టీఓ విజయవాడ


