క్రీడలతో టీమ్ వర్క్ పెంపు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కబడ్డీతో యువతలో టీమ్ వర్క్ పెంపొందుతుందని ఎకై ్సజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈడుపుగల్లులోని సీతారామ గార్డెన్స్ ఆవరణలో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలను గురువారం ప్రారంభమయ్యాయి. కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాజరై పోటీలను ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలను నిర్మిస్తామన్నారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. లీగ్ కమ్ నాకౌట్ దశలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళలో పోటీలు జరుగుతాయన్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్థన్‌రావు, అసోసియేషన్ సభ్యులు అర్జునరావు, కేవీ నాంచారయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


