
● కృష్ణమ్మ పరవళ్లు
జగ్గయ్యపేట: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండటంతో మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు 12 గేట్‌లను ఎత్తి బుధవారం దిగువకు 3.24లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు విడుదల చేయటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ముక్త్యాల, రావిరాల, వేదాద్రి గ్రామాలలో కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముక్త్యాలలోని కృష్ణానది ఒడ్డునున్న భవానీ ముక్తేశ్వరాలయం మునగటంతో మత్స్యకారులు తమ పడవలకు తగిన రక్షణ చర్యలు చేపట్టారు. వేదాద్రి యోగానంద ఆలయంలోని కేశ ఖండనశాల మునిగింది. వరద పరిస్థితిని నియోజకవర్గ ప్రత్యేకాధికారి బాలాజీ కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో నితిన్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ మనోహర్, వీఆర్వో చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఆయన వెంట ఉన్నారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి 3.24 లక్షల క్యూసెక్కులు విడుదల

● కృష్ణమ్మ పరవళ్లు