
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
7
బుద్ధుని మార్గం స్ఫూర్తిదాయకం
విజయవాడ కల్చరల్: నగరంలోని పీబీ సిద్ధార్థ కళాపీఠంపై మంగళవారం రాత్రి ప్రదర్శించిన బుద్ధునితో నా ప్రయాణం’ నాటకం ఆకట్టుకుంది. నాడు బుద్ధుడు ప్రతిపాదించిన జీవన విధానం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలియజెప్పింది.
సాగర్ నీటిమట్టం 568.30 అడుగులు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 568.30 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్ బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
నందిగామ మండలంలోని కేతవీరునిపాడులో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ప్రసంగించారు.
–8లోu
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో గందరగోళం నెలకొంది. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను పరిశీలించి, వాటి ఆధా రంగా పోస్టులు కేటాయించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కొన్ని సబ్జెక్టులకు అవసరంకన్నా ఎక్కువ పోస్టులను నోటిఫై చేయగా, మరికొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ పూర్తిగా విస్మరించడం అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ప్రభుత్వ చర్యలతో డీఎస్పీ అభ్యర్థులు నమ్మకం కోల్పోతున్నారు.
స్పెషల్ ఎడ్యుకేషన్‌పై చిన్నచూపు
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టుల అభ్యర్థులను ప్రభుత్వం విస్మరించింది. తెలుగు సబ్జెక్టులో 42 ఖాళీలు ఉండగా 39 పోస్టులు మాత్రమే నోటిఫై చేసింది హిందీలో 54 ఖాళీలకు 25 పోస్టులు మాత్రమే విడుదల చేసింది. ఉర్దూ, సంస్కృతం, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పోస్టునూ ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ప్రత్యేక విద్య అవసరాలున్న పిల్లలకు ఉపాధ్యాయులే లేకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిని కలిగిస్తోంది.
నోటిఫై చేసిన పోస్టుల్లో వ్యత్యాసాలు
పీడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) విభాగంలో 128 ఖాళీలు ఉండగా 123 పోస్టులు మాత్రమే నోటిఫై చేసింది. పీఎస్ హెచ్‌ఎం/ఎస్‌ఏ విభాగంలో ఆరు ఖాళీలు ఉన్నా ఏ ఒక్క పోస్టుకూ నోటిఫికేషన్ రాకపోవడం అర్హులైన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. మరోవైపు, ఎస్జీటీ విభాగంలో మాత్రం 431 ఖాళీలకు 547 పోస్టులను ప్రకటించి నోటిఫై చేయడం గమనార్హం.
క్లస్టర్ టీచర్ వ్యవస్థతో గందరగోళం
డీఎస్సీ ద్వారా మొత్తం 1,213 ఖాళీలకు 1,048 పోస్టులనే నోటిఫై చేయడంతో నిరుద్యోగులకు న్యాయం జరిగిందా అనే సందేహం తలెత్తుతోంది. ఇప్పటికే పనిచేస్తున్న క్లస్టర్ టీచర్లు దాదాపు అన్ని చోట్లా ఖాళీలను భర్తీ చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రకటించిన ఖాళీలను భర్తీ చేసేందుకు డీఎస్సీ ప్రక్రియను కొనసాగిస్తోంది. క్లస్టర్ టీచర్లు ఖాళీలను భర్తీ చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష రాసినా తమకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయా అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
అవసరాలను పట్టించుకోలేదు
కూటమి ప్రభుత్వం ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు చేసింది. కేవలం సీనియారిటీ ఆధారంగా బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టడంతో పలు పాఠశాలల్లో విద్యా అవసరాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా పలు పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు కరువయ్యారు. దీంతో పాఠశాలల్లో బోధన దెబ్బతింటోంది. ప్రభుత్వం ఈ సమస్యలను కావాలనే విస్మరిస్తోందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
న్యూస్‌రీల్
క్లస్టర్ టీచర్ల ముసుగులో భర్తీని అడ్డుకోవడమే!
ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల్లో క్లస్టర్ టీచర్లను నియమించి పనిచేయిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎస్‌ఏ తెలుగులో 78 మంది, ఇంగ్లిష్ 49, మ్యాథ్స్ 24, ఫిజికల్ సైన్స్ 17, సోషల్ స్టడీస్ 36, బయోలాజికల్ సైన్స్ 8, పీడీ 8, సంస్కృతం 1, ఉర్దూ ఎస్‌ఏలో ముగ్గురుతో పాటు, ఎస్జీటీ తెలుగు 428 మంది, ఎస్జీటీ ఉర్దూ టీచర్లు 41మంది చొప్పున ఉన్నారు. ఈ పోస్టులన్నీ తాత్కాలికంగా ఉపయోగపడుతున్నా, ప్రభుత్వం కొత్తగా పోస్టులు నోటిఫై చేయాల్సిన అవసరమే లేదన్న విధంగా వ్యవహరిస్తే, అది నియామక ప్రక్రియ నైతికతను దెబ్బతీస్తుంది.
డీఎస్సీలో నిరుద్యోగులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు కొన్ని సబ్జెక్టులకు అవసరానికి మించి ఖాళీలు కొన్ని పోస్టులు అవసరమైనా డీఎస్సీ నోటిఫికేషన్‌లో చూపని వైనం పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో నిరుద్యోగులకు నష్టం సబ్జెక్ట్ టీచర్ల లేమితో పాఠశాలల్లో బోధనకు ఇబ్బందులు
పునర్వ్యవస్థీకరణతో తగ్గిన ఖాళీలు
కూటమి ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లాలో 2,710 పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,687కి తగ్గింది. 1,177 బేసిక్ ప్రైమరీ స్కూల్స్, 313 ఫౌండేషనల్ స్కూల్స్, 453 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. పలు పాఠశాలల స్థాయిని తగ్గించగా, మరికొన్నింటి స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని ఉన్నత పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా స్థాయి తగ్గించి, ఆ మేరకు ఉపాధ్యాయుల ఖాళీలను కుదించింది. ఉమ్మడి జిల్లాలో బయోలాజికల్ సైన్స్ విభాగంలో 132 ఖాళీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం 142 పోస్టులను నోటిఫై చేసింది. మ్యాథ్స్ విభాగంలో 38 ఖాళీలు ఉండగా 52 పోస్టులు, ఫిజికల్ సైన్స్‌లో 44 ఖాళీలకు 54 పోస్టులు, సోషల్ స్టడీస్‌లో 113 ఖాళీలకు 135 పోస్టులు, ఇంగ్లిష్‌లో 48 ఖాళీలకు 93 పోస్టులను నోటిఫై చేసింది. ఖాళీలు తక్కువగా ఉన్నా పోస్టులు ఎక్కువగా చూపడం గమనార్హం.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ