
విజ్ఞాన జ్యోతి.. అంబేడ్కర్ స్ఫూర్తి
ఓ సామాజిక విప్లవం.. ఓ తాత్విక అధ్యయనం.. ఓ అభ్యుదయ భావ మూర్తిమత్వం.. అణగారిన ప్రజల గుండెల్లో వెలుగు దివ్వె, భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వక్తలు కొనియాడారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా వాడవాడలా అంబేడ్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంతోపాటు అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. రాజ్యాంగ రూప శిల్పిగా జాతికి చేసిన మేలులను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ