
సెపక్ తక్రా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: మణిపూర్‌లో ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలబాలికల సెపక్ తక్రా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు ఏపీ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. బాలురు జట్టుకు జి.సతీష్, కె.కుశల్, డి.ఎం.షాహిద్, టి.జశ్వంత్, టి.వంశీ, బాలికలు జట్టుకు పి.హరిప్రియ, కె.వెంకటలక్ష్మి, పి.దుర్గమధురశ్రీ, సి.తేజ, జి.రమ్య ఎంపికై నట్లు వివరించారు. ఈ జట్లుకు కోచ్, మేనేజర్‌లుగా ఎస్.రమేష్, ఎం.సంతోషికుమారి, డి.సుంకరరావు వ్యవరిస్తారని వెల్లడించారు. ఈ జట్లను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు(ఎస్‌పీడీ) బి.శ్రీనివాసరావు పటమట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అభినందించారు.