
సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. ఇటీవల జిల్లా శాఖకు నిర్వహించిన ఎన్నికలలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడు డి. సత్యానారాయణరెడ్డి, సహా అధ్యక్షుడు వి.వి. ప్రసాద్, కార్యదర్శి పి. రమేష్‌కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కలెక్టర్‌ను మార్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి. సతీష్ కుమార్, డి. విశ్వనాథ్, జి.రామకృష్ణ, బీబీ రమణ, వి. నాగార్జున నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.