
వైఎస్సార్ సీపీలో చేరిన వారితో ఎమ్మెల్సీ అరుణకుమార్
ఎమ్మెల్సీ అరుణకుమార్
నందిగామ టౌన్: తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నందిగామలోని ఏడోవార్డుకు చెందిన 80మంది పెద్దముఠా సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి ఆపార్టీలో చేరిన పెద్దముఠా సభ్యులు, టీడీపీ వారి మోసపూరిత హామీలను గ్రహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నాయకులు మాడుగుల మనోహర్, బోజవాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కంచికచర్లలో 42కుటుంబాలు చేరిక
కంచికచర్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాల ద్వారా లబ్ధిపొంది, అభివృద్ధిపథంలో పయనిస్తున్న మహిళలే ఈ ఎన్నికల్లో జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. కంచికచర్ల అరుంధతీ, అంబేడ్కర్‌నగర్ నుంచి 42కుటుంబాలు టీడీపీని వీడి గురువారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎమ్మెల్సీ అరుణకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నందిగామ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావును మరోసారి గెలిపించాలని వారికి సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ అరుణకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు మహిళలు నమ్మించి మోసం చేయగా, సీఎం జగనన్న మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు అన్నిరంగాల్లో సముచితస్థానం కల్పించారన్నారు. అందుకే మళ్లీ ప్రతి మహిళ జగనన్నకు అండగా ఉంటామని చెబుతున్నారన్నారు. అందరికీ మేలు చేసిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కంచికచర్ల పట్టణ కన్వీనర్ వేమా సురేష్‌బాబు, నాయకులు అమర్లపూడి యోహాన్, మహిళలు పాల్గొన్నారు.

కంచికచర్లలో పార్టీలో చేరినవారితో ఎమ్మెల్సీ అరుణకుమార్, సురేష్‌బాబు