అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

Published Mon, May 27 2024 8:55 PM

YSRCP Meet and Greet Celebrations in America

టీటీఏ మహాసభలో భాగంగా వైఎస్సార్‌సీపీ మీట్ అండ్ గ్రీట్

పొలిటికల్ సెషన్స్‌లో జరిగిన కార్యక్రమం

జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) మెగా కన్వెన్షన్‌ సియాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 24 నుంచి 3 రోజులపాటు మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభలో భాగంగా వైఎస్సార్‌సీపీ మీట్ అండ్ గ్రీట్‌తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సభలకు వైఎస్సార్‌సీపీ నేతలు, రాజన్న అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

వైఎస్సార్ ప్రజలందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు.

పొలిటికల్ సెషన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి  డాక్టర్‌ వైఎస్సార్‌ అభిమానులు. సీఎం జగన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసంగాల మధ్యలో జోహార్ వైయస్ఆర్ నినాదాలతో, హొరెత్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement