ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు

Telugu Association Of North America 23rd Tana Conference To Be Held At Philadelphia - Sakshi

అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభలుఈ ఏడాది జులై 7 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. స్థానిక పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో వీటిని నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి నేతృత్వంలోని  తానా మహాసభల సమన్వయ కమిటీల నియమించారు. 


మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు అప్పగించారు. 

కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు :

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top