‘అక్షర దీపిక’ జూన్‌ ఎడిషన్‌ విడుదల

NATS Realesed 2021 June Magazine Akshara Deepika And Provide All Details About NATS Activity - Sakshi

ప్రవాస భారతీయులకు అండగా నాట్స్‌

నాట్స్‌ ఆధ్వర్యంలో కాన్సులర్‌ సర్వీసెస్‌ క్యాంప్‌  

టెంపాబే : ప్రవాత భారతీయులకు అండగా ఉంటూ వస్తోన్న  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) 2021 జూన్‌కి సంబంధించి అక్షర దీపికను విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో నాట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను క్రోడీకరించారు. ముఖ్యంగా  టెంపాబే నాట్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో నిర్వహించిన కాన్సులర్‌ సర్వీసెస్‌ క్యాంప్‌ చాలా మందికి ఉపయోగపడిందని అక్షర దీపికలో పేర్కొన్నారు. పాస్‌పోర్టు పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్‌ దరఖాస్తు, ఐసీఐ దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ, లైఫ్‌ సర్టిఫికేషన్‌, ధ్రువీకరణ వంటి సేవలు ఈ కాన్సులర్‌ ద్వారా అందించారు. సుమారు 400ల మందికి పైగా భారతీయులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. 

నాట్స్‌ ఆధ్వర్యంలో
కాన్సులర్‌ సర్వీసెస్‌తో పాటు విద్యార్థుల కోసం వెబినార్స్‌ నిర్వహించారు. న్యూజెర్సీలో బాల సుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం, యోగా, తులసీ దళంలతో పాటు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు నాట్స్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. జులై, ఆగష్టులలో సూపర్‌ బ్రెయిన్‌ వర్క్‌షాప్‌లను నిర్వహించబోతునట్టు తెలిపారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top