ఘనంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్

Nats 7th America Telugu Celebrations Kickoff Event - Sakshi

నాట్స్‌ (North America Telugu Society) అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎక్స్పో సెంటర్, ఎడిసన్‌లో జరుగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నద్ధం చేసేలా తాజాగా నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్‌కు తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

స్థానిక సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి గణేశ ప్రార్ధన, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టారు.నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, సంబరాలు కో కన్వీనర్ వసుంధర దేసు, బిందు ఎలమంచిలి, స్వాతి అట్లూరి, ఉమ మాకం,  గాయత్రీలు  జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షులు బాపు నూతి 7 వ నాట్స్ అమెరికా సంబరాలు 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ లో జరుగనున్నట్టు ప్రకటించి, అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానిని సభకి పరిచయం చేశారు. 

సంబరాల కోర్ కమిటీ సభ్యులైన  రాజేంద్ర అప్పలనేని - కో కన్వీనర్, వసుంధర దేసు - కో కన్వీనర్, రావు తుమ్మలపెంట (టి పి) - కోఆర్డినేటర్, విజయ్ బండ్ల - కోఆర్డినేటర్, శ్రీహరి మందాడి - డిప్యూటీ కన్వీనర్, రాజ్ అల్లాడ - డిప్యూటీ కన్వీనర్, శ్యామ్ నాళం - కాన్ఫరెన్స్ సెక్రటరీ, చక్రధర్ వోలేటి-కాన్ఫరెన్స్ ట్రెజరర్, రంజిత్ చాగంటి-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్‌ సభ్యుల ఈ సందర్భంగా  పరిచయం చేశారు. అనంతరం నాట్స్‌ భవిష్యత్‌ కార్యక్రమాలపై వక్తలు ప్రసంగించారు. 

నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ గౌరవ బోర్డ్ సభ్యులు డా.రవి ఆలపాటి, శేఖరం కొత్త,  బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ వెనిగళ్ల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల,  వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & ఫైనాన్స్) భాను ధూళిపాళ్ల,  వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్), మదన్ పాములపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్) గురు కిరణ్ దేసు, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ - సూర్య గుత్తికొండ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top