పిల్ల ఏంటి పుల్లలా ఉంది! అవమానాల్ని దిగమింగుకుంది.. హఠాత్తుగా నింగికెగసింది

Megha Thakur Death News: This Is The Cause Of Her Death - Sakshi

అట్టావా: ఆమె వీడియోలు చూసి బోలెడంత మంది పగలబడి నవ్వుకున్నారు. పుల్లలా ఉంది! ఇదేం ఇన్‌ఫ్లుయెన్సర్‌ రా బాబూ అంటూ జోకులు పేల్చారు.  అయితే అవమానాలకు ఆమెకు కుంగిపోలేదు. నవ్వుతూనే ముందుకు సాగింది. ఒకానొక దశలో పరిధి దాటినా.. ఆమె ఒర్చుకుంది. ఆమె సానుకూల వైఖరికి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. క్రమక్రమంగా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. అలా అందనంత ఎత్తుకు ఎదుగుతుందని ఆమె తల్లిదండ్రులు ఆశపడుతున్న టైంలో.. విధి దెబ్బ కొట్టింది. 

ఇండో-కెనెడియన్‌ సోషల్‌ మీడియా సెలబ్రిటీ మేఘా థాకూర్‌.. కెనడాలో మరణించింది. 21 ఏళ్ల ఈ ఇన్‌ఫ్లూయెన్సర్‌ హఠాన్మరణాన్ని  ఆమె తల్లిదండ్రులు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా ధృవీకరించారు. ఆమె తమను వీడిందంటూ భావోద్వేగ సందేశం ద్వారా విషయాన్ని తెలియజేశారు. అయితే ఆమె ఎలా మరణించింది అనే విషయాన్ని వాళ్లు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. మేఘా థాకూర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 24వ తేదీన ఆమె చనిపోగా.. మే 29వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. 

భారత సంతతికి చెందిన 21 ఏళ్ల మేఘ థాకూర్‌..  2001, జులై 17వ తేదీన ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)లో జన్మించింది. ఆపై కుటుంబంతో కెనడాకు చేరుకుంది. ఒంటారియో మేఫీల్డ్‌ సెకండరీ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి వెస్ట్రన్‌ యూనివర్సిటీలో చేరింది మేఘ. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాపులర్‌ అయిన మేఘకు.. ఫాలోయింగ్‌ ఎక్కువే. 

మోడలింగ్‌ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆ యువతికి మొదట్లో బక్కచిక్కిన పర్సనాలిటీ వల్ల అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఆమె ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆత్మ విశ్వాసం, బాడీ పాజిటివిటీ గురించి ఆమె చేసిన వీడియోలు, స్పీచ్‌లు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. సెలబ్రిటీల డ్రెస్సింగ్‌ను, వాళ్ల ఆటిట్యూడ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని వీడియోలు చేసేది మేఘ.  అలా ఆమెకు సోషల్‌ మీడియా గుర్తింపు దక్కినా.. చిన్నవయసులో రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణంతో నింగికెగసి అభిమానుల్లో విషాదాన్ని నింపింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top