కువైట్‌లో ఘనంగా వైఎస్సార్‌ వర్థంతి వేడుకలు

Kuwait NRIs Pays Tribute To YSR On 14th Death Anniversary  - Sakshi

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు కువైట్ లో జరిగాయి. వైఎస్సార్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశానుసారం కువైట్లోని, మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అభిమానులు రాజన్న 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. 

వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జన హృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరఫున నివాళులు అర్పించారు. తండ్రి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. APNRTS రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి, వైకాపా బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కల్యాణ్ తెలిపారు. స్వర్గీయ వైయస్ఆర్. మహానేత ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయాల్లో కూడా 4 శాతం అవకాశం కల్పించి ముస్లిం సోదరులు రాజకీయ ఎదుగుదలకు అవకాశమిస్తున్నారని.. వైఎస్ఆర్సిపీ కువైట్ కమిటీ మైనారిటీ ఇన్చార్జ్ గఫార్, మరియు షేక్ రహమతుల్లా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు అన్నాజీ రావు, అబు తురాబ్, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు,మైనార్టీ నాయకులు షా హుస్సేన్,మహబూబ్ బాషా,సీనియర్ నాయకులు సుబ్బారావు, యువజన విభాగం సభ్యులు ఏ బాలకృష్ణ రెడ్డి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు, లక్ష్మి ప్రసాద్, జగనన్న సైన్యం అధ్యక్షుడు బాషా, పాటూరు వాసుదేవ రెడ్డి, అప్సర్ అలీ, పోలి గంగిరెడ్డి, బి. మహేశ్వర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సోదరులు పాల్గొన్నారు.

(చదవండి: దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top