బైడెన్‌ జట్టులో మరో భారతీయుడు | Joe Biden Appointed Indo American Ashish Jha As Covid 19 Co Ordinator | Sakshi
Sakshi News home page

బైడెన్‌ జట్టులో మరో భారతీయుడు

Mar 18 2022 1:19 PM | Updated on Mar 18 2022 1:27 PM

Joe Biden Appointed Indo American Ashish Jha As Covid 19 Co Ordinator - Sakshi

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ జట్టులో మరో భారతీయుడికి చోటు దొరికింది. కోవిడ్‌ మరో వేవ్‌ ముంచుకొస్తుందనే ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ ఇండో అమెరికన్‌ డాక్టర్‌ ఆశీష్‌ ఝాకు కీలక బాధ్యతలు అప్పగించారు జోబైడెన్‌. ఆశీష్‌ఝాకి కోవిడ్‌ 19 కోఆర్డినేటర్‌ బాధ్యతలను కట్టబెడుతున్నట్టు జో బైడెన్‌ స్వయంగా ప్రకటించారు. 

బిహార్‌లోని మధుబని జిల్లా అశీష్‌ కుమార్‌ ఝా స్వస్థలం. అశీష్‌ఝాకి తొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు ముందుగా కెనాడా షిఫ్ట్‌ అయ్యారు. అక్కడి నుంచి 1983లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మెడికల్‌ డిగ్రీ కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో ఆయన పట్టా సాధించారు. బ్రౌన్‌ యూనివర్సిటీకి గత రెండేళ్లుగా డీన్‌గా పని చేస్తున్నారు. బతుకు దెరువు కోసం అమెరికా వచ్చిన వ్యక్తికి పెద్ద పదవిని ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు అశీష్‌ కుమార్‌ ఝా.

చదవండి: నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా షెఫాలీ జర్దాన్‌ దుగ్గల్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement