విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం

 Job Site Indeed Report: Search For Overseas Job Opportunities Continues  To Remain Steady From India - Sakshi

ముంబై: కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రయాణ అంక్షలు ఉన్నప్పటికీ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ నివేదిక వెల్లడించింది. ‘2019–21లో విదేశీ ఉద్యోగాల కోసం శోధన పెరిగింది. వీరిలో యూఎస్‌లో జాబ్‌ కోసం 40 శాతం మంది ఉత్సాహం కనబరిచారు. కెనడాలో ఉద్యోగం కోసం 16 శాతం మంది సర్చ్‌ చేశారు. జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, గ్రేట్‌ బ్రిటన్, ఖతార్, సింగపూర్, ఆస్ట్రేలియా ఉన్నాయి. 

భారత్‌ వెలుపల జాబ్‌ కోసం 2019 నవంబర్‌–2020 ఏప్రిల్‌ మధ్య అత్యధికంగా శోధించారు. అంత క్రితం కాలంతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. సెకండ్‌ వేవ్‌తో ప్రయాణ అంక్షల కారణంగా ఆ తర్వాత ఈ ప్రక్రియ తగ్గింది. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ నుండి ప్రపంచం కోలుకున్న వెంటనే విదేశీ అవకాశాల కోసం ఉద్యోగ శోధనలు ఊపందుకుని స్థిరంగా కొనసాగాయి. 

థర్డ్‌వేవ్‌ మధ్య కూడా భారతీయులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రధానంగా ఐటీ ఉద్యోగాల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ ప్రతిభ ప్రపంచ దృష్టిని చాలా ఆకర్షిస్తోంది. విదేశీ ఉద్యోగ వేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్, డేటా అనలిస్ట్‌ టాప్‌లో ఉన్నారు. ఐటీ సాంకేతిక నిపుణులకు యూఎస్, ఉత్తర అమెరికా, యూకే టార్గెట్‌ కాగా, ఇంజనీరింగ్‌ అభ్యర్థులు గల్ఫ్‌ ప్రాంతంపై ఫోకస్‌ చేశారు’ అని నివేదిక వివరించింది.  
 

చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top