ఎన్నారైలతో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ భేటీ | Sakshi
Sakshi News home page

ఎన్నారైలతో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ భేటీ

Published Mon, Apr 25 2022 1:49 PM

GHMC Deputy Mayor Invited NRI to Global city Hyderabad For Investments - Sakshi

డౌనర్స్ గ్రోవ్‌ (షికాగో): అమెరికా పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. షికాగోలో ప్రజా రవాణా, కోవిడ్ పరీక్షా కేంద్రాలు, పార్కుల నిర్వహణ, పారిశుధ్యం, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కార్యకలాపాలు ముఖ్యంగా ఫ్లాష్ వరద నీటి నియంత్రణ ప్రక్రియ  పరిశీలించడానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకులతో కలిసి నాపర్విల్లే, షాంబర్గ్ నగర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా  షికాగోలోని డౌనర్స్ గ్రోవ్‌ లో ప్రవాస భారతీయులతో డిప్యూటీ మేయర్‌ బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ సామల హేమ, టీటీసీసీసీ అధ్యక్షురాలు శోభనారెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాట్స్ నాయకులు, ఎంటర్‌ప్ర్యూనర్‌ శ్రీనివాస్ పిడికిటి సమన్వయంతో ఈ భేటి ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎలా ఎదుగుతుంది? మల్టినేషనల్ కంపెనీలకు ఎలా వేదికగా మారుతుందనే అంశంపై డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ఎన్నారైలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎన్నారై నాయకులు, పారిశ్రామికవేత్తలు మహేష్ కాకర్ల, మదన్ పాములపాటి, శ్రీని యార్లగడ్డ, శ్రీనివాస్ బొప్పన, శ్రీని అరసడ, రవి శ్రీకాకుళం, కేపీ, విజయ్ వెనిగళ్ల, లక్ష్మి బొజ్జ, బిందు బాలినేని, అను, అనిత, రాధ, సుమతి, సుధ, డాక్టర్ నీలిమ, శోభ, దేవి, రాజేష్ వీదులమూడి, కృష్ణ నున్న, కృష్ణ నిమ్మగడ్డ, మనోహర్ పాములపాటి, ఆర్కే, హరీష్ జమ్ముల తదితరులు పాల్గొన్నారు. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement