ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.

Dussehra And Bathukamma Celebrations In Finland - Sakshi

నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. 

దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి  సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు.

తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, 

ఇక ముందు కూడా ఫిన్లాండ్‌లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top