బోధన్: సాలూర మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీగా తరచు జరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని వేర్వేరు మూడు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, రా గి తీగలు, ఆయిల్‌ను చోరీ చేశారు. గత నెలలో మంజీర నది తీరంలో ఉన్న ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్‌హౌజ్ వద్ద బిగించిన మరుసటి రోజే ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి ఆయిల్‌ను చోరీ చేశారు. రెండు రోజుల క్రితం ఓ రైస్‌మిల్లు ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, రాగితీగలు, ఆయి లు దొంగలించారు. సాలూరకు సమీపంలోని తగ్గేల్లి గ్రామం వద్ద గల ఓ రైస్‌మిల్లుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి ఆయిల్ తీసుకెళ్లారని రైస్‌మిల్లు సిబ్బంది ఇటీవల తెలిపారు. ఇలా వరుసగా ట్రాన్స్ఫార్మర్ల చోరీ ఘటనలతో కరెంట్ సరఫరాలో అంతరాయంతోపాటు, పంటల సాగుపై తీవ్ర ప్ర భావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


