ఇజ్రాయెల్‌–తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌–తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రకాశ్‌

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

ఇజ్రాయెల్‌–తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ క్రీడాస్ఫూర్తిని చాటాలి తల్లీకొడుకులు..

వేల్పూర్‌/జక్రాన్‌పల్లి: వేల్పూర్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన నీరటి ప్రకాశ్‌ ఇ జ్రాయెల్‌ దేశంలో ఇజ్రాయెల్‌–తెలంగాణ అ సోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇజ్రా యెల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌తోపాటు, ఎక్కువ మంది ప్యానల్‌ సభ్యులు వి జయం సాధించినట్లు మీడియాకు వెల్లడించా రు. ఉపాధ్యక్షుడిగా కరణ్‌గౌడ్‌, కోశాధికారిగా సందీప్‌, ప్రధాన కార్యదర్శిగా శివగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ప్యానల్‌పై నమ్మ కముంచి ఘన విజయాన్ని అందించిన తెలంగాణవాసులకు ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కమ్మర్‌పల్లి: క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం కమ్మర్‌పల్లి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యుడు శ్రీపాద రాజేందర్‌ చారీ స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. స్థానిక మినీ స్టేడియం అప్రోచ్‌ రోడ్‌, ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన హరీష్‌, మురళీధర్‌ జోడికి రూ. 8వేల నగదుతోపాటు, ట్రోఫీని అందజేశారు. రన్నర్‌ జోడీ కిషన్‌, మోహన్‌ రెడ్డికి రూ. 5వేల నగదుతోపాటు, ట్రోఫీని అందజేశారు. సర్పంచ్‌ హారిక, ఉప సర్పంచ్‌ అశోక్‌, కేబీఏ అధ్యక్షుడు లుక్క గంగాధర్‌, సభ్యులు అహ్మద్‌, పవన్‌, ప్రదీప్‌, నాయకులు దేవేంధర్‌, చిన్నారెడ్డి, సుభాషగౌడ్‌, సుధాకర్‌, బద్రి, స్వామి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో వ్యక్తి అదృశ్యం

సుభాష్‌నగర్‌: నగరంలోని ముజాయిద్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ అర్బాజ్‌ అదృశ్యమైనట్లు ఐదో టౌన్‌ ఎస్సై సునీల్‌ ఆదివారం తెలిపారు. అక్టోబర్‌ 10న అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి, ఇప్పటికీ తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు, ఎంత వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అర్బాజ్‌ భార్య నజియా బేగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ తల్లి తన కుమారుడితోపాటు అదృశ్యమైనట్లు ఐదోటౌన్‌ ఎస్‌ఐ సునీల్‌తెలిపారు. అక్టోబర్‌ 5న ఆమె తన కుమారుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోగా, ఇప్పటికీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. ఈవిషయమై ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement