భూ సేకరణను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణను వేగవంతం చేయాలి

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో

జాప్యం ఉండొద్దు

వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సంజయ్‌ జాజు

నిజామాబాద్‌ అర్బన్‌: రైల్వే ప్రాజెక్టుల కోసం అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సూచించారు. రైల్వే లైన్‌ల విస్తరణ, డబ్లింగ్‌, ఇతర అభివృద్ధి పనుల కోసం చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా లో నిర్దేశిత రైల్వే ప్రాజెక్టుల కోసం అవసరమైన స్థల సేకరణ కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాల్లో అనవసర జాప్యానికి తావు లేకుండా భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో, భూ యజమానులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంబించాల ని సూచించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిజామాబాద్‌ నగర శివారులో బైపాస్‌ లైన్‌ కోసం భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సీఎస్‌కు తెలిపారు. నిజామాబాద్‌ మీదుగా కొనసాగుతున్న ముథ్కేడ్‌ – మేడ్చల్‌ డబ్లింగ్‌ పనుల కోసం భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement