న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
‘ఇందూరు ప్రజలే నా ధైర్యం. ఇక్కడి ప్రజల అండతోనే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. నన్ను ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపించి అక్కున చేర్చుకున్నారు. ఇంతకుముందులాగే ఇకముందు కూడా నాకు అండగా ఉండాలి. భవిష్యత్‌లోనూ ఆశీర్వదించాలి’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ప్రసంగించారు. తాను ఎక్కడికి వెళ్లినా నిజామాబాద్ కోడలిగా చెప్పుకునేందుకు గర్వపడతానని అన్నారు.


