సాగు లెక్క.. ఇక పక్కా.. | - | Sakshi
Sakshi News home page

సాగు లెక్క.. ఇక పక్కా..

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

రెంజల్‌: జిల్లాలో వరి, ఆరుతడి, కూరగాయలతోపా టు ఇతర పంటల సాగు లెక్క ఇక పక్కాగా నమో దు కానుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ డిజిటల్‌ క్రాప్‌ సర్వేను ప్రారంభించింది. సోమ వారం నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను సేకరించేందుకు ఏఈవోలు, వలంటీర్లు రైతుల పొలాల వద్దకు చేరుకుని పంటల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక యాప్‌లో పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఎంత మంది రైతులు, ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను సర్వే నంబర్లతో సహా డిజిటల్‌ క్రాప్‌ సర్వే ద్వార యాప్‌లో నమోదు చేస్తున్నారు.

వలంటీర్లతో సర్వే

గతంలో గ్రామాల్లో పూర్తిగా ఏఈవోలు క్రాప్‌ సర్వే నిర్వహించే వారు. ప్రస్తుతం ఏఈవోలు తగిన సంఖ్యలో లేకపోవడంతోపాటు ఉన్నవారిపై పని భారం పెరగడంతో వ్యవసాయశాఖ తాత్కాలికంగా వలంటీర్లను నియమించింది. ఏఈవోల సహకారంతో వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 106 మంది ఏఈవోలు ఉండగా వారికి తోడుగా 427 మంది వలంటీర్లతో డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం వద్ద ఉన్న సాగు భూముల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాల్లో తేడా ఉండటంతో రైతులు ధాన్యం విక్రయించే సమయంలో గతంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల భూమి సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో లేక పోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఏఈవోలు సకాలంలో సర్వే పూర్తి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. గతంలోని పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ సారి సర్వే పక్కాగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

పారదర్శకంగా పంటల సర్వే

జిల్లాలో 427 మంది వలంటీర్లతో డిజిటల్‌ క్రాప్‌ సర్వే జరుగుతోంది. వారం రోజు లుగా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. సర్వే ఆధారంగా రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. జియో ట్యాగింగ్‌తో కచ్చితత్వం ఉంటుంది. వాస్తవ సాగు వివరాలను పక్కాగా నమోదు చేస్తాం.

– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

ప్రారంభమైన డిజిటల్‌ క్రాప్‌ సర్వే

కొనసాగుతున్న పంటల వివరాల నమోదు

జిల్లాలో 427 మంది వలంటీర్లు,

106 మంది ఏఈవోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement