మాస్టర్‌ ప్లాన్‌ ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌ ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తున్నాం

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌, నుడా మాస్టర్‌ ప్లాన్‌లో అనేక లోపాలు ఉన్న దృష్ట్యా ఆ ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ, గతంలో అభ్యంతరాలు, మార్పులు కోరిన వారితో చర్చలు జరిపి అందరి ఆమోదంతో సీఎం ఆ మోదానికి పంపిస్తామని వివరించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవా రం తనను కలిసిన నగర అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. నగర అభివృద్ధి విషయమై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలందరికీ ఉపయోగపడేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆకుల ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, ఉపాధ్యక్షులు షేక్‌ హుస్సేన్‌, నారాయణరెడ్డి, కరిపే రవీందర్‌, జహీరుద్దీన్‌, ముస్తఫా, నాగేశ్వరరావు, రాజు, సత్యం తదితరులు ఉన్నారు.

తెయూ బీఈడీ ఫలితాలు విడుదల

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల యం 2024 బ్యాచ్‌ బీఈడీ పరీక్ష ఫలితాలను వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. యాదగిరి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 1,354 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 1,288 మంది (95.12 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ కే సంపత్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కంట్రోలర్‌ శాంత పాల్గొన్నారు.

మారథాన్‌లో

కానిస్టేబుల్‌ సత్తా

జక్రాన్‌ పల్లి: జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో మండలంలోని పడకల్‌ గ్రామానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పిల్లి మహిపాల్‌ సత్తాచాటాడు. 42.195 కిలోమీటర్ల మారథాన్‌ను 05:05:41 గంటల్లో పూర్తి చేసి మెడల్‌ అందుకున్నారు. మహిపాల్‌ ప్రస్తుతం బాల్కొండ సర్కిల్‌ ఆఫీసులో కానిస్టేబుల్‌గా విధులు ని ర్వర్తిస్తున్నాడు. గతేడాది నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌ను సైతం పూర్తి చేశాడు. ఇప్పటి వరకు నాలుగు హాఫ్‌ మారథాన్‌లతోపాటు రెండు 10 కేఎంలో పా ల్గొన్న మహిపాల్‌.. అక్టోబర్‌లో ఢిల్లీలో నిర్వహించనున్న వేదాంత హాఫ్‌ మారథాన్‌లో పాల్గొననున్నట్లు తెలిపాడు.

ప్రజావాణికి

ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 159 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తోపాటు ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, డీఆర్‌వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌ డ్‌, డీపీవో శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీశైలంకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ ప్రజావాణికి 34..

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 34 ఫిర్యా దులు అందగా, వాటిని తక్షణమే పరిశీలించి చట్టప్రకారం బాధితుల సమస్యలను పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement