డొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం (ఆగస్టు 31) నాటితో గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పలు పత్రాలు అందక దరఖాస్తు చేసుకోలేని వారికి ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం వరకు ఆయా కేటగిరిల్లో 17,466 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం మరో 15 రోజులు దరఖాస్తులకు సమయం ఇవ్వడంతో మరింతమంది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
బాధ్యతలు
స్వీకరించిన జడ్జీలు
నిజామాబాద్ లీగల్ : సీనియర్ సివిల్ జడ్జీలుగా పదోన్నతి పొందిన ముగ్గురు న్యాయమూర్తులు సోమవారం ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి నుంచి బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జీగా అజయ్ ఉల్లమ్, అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జీగా చైతన్య, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శిగా ముద్దసాని నీలిమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబా ద్ జిల్లా కోర్టులో గత కొన్ని నెలలుగా ఖాళీగాఉన్న న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కావడంతో బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఖాళీగా ఉన్న మిగితా మేజిస్ట్రేట్ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
● ఈనెల 15వ తేదీ వరకు అవకాశం
● ఇప్పటికే జిల్లాలో 17,466 అప్లికేషన్లు
కేటగిరి వారీగా అందిన దరఖాస్తులు


