వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

మాక్లూర్‌: మండలంలోని కృష్ణనగర్‌ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 9వ మహా సభలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను శనివారం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశె ట్టి సాయిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకు లు ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు మంచిర్యాలలో నిర్వహించే మహా సభలకు ముఖ్యఅతిథులుగా వేములపల్లి వెంకట్రామ య్య, ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌, ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు, వీ కోటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌ పాల్గొంటారని సాయి రెడ్డి తెలిపారు. రైతాంగ సమస్యలపై నిర్వహించే మహాసభలను రైతులు, కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. నాయకులు దేదావత్‌ బన్సీ, డీ అనురాధ, డీ పద్మ, సక్రు, మంగమ్మ, లక్ష్మి, రజిత, సుజాత పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం పరిశీలన

మాక్లూర్‌: మండల కేంద్రంలోని ఉర్ధూ పాఠశాలలో శనివారం మధ్యా హ్న భోజనాన్ని ఉర్దూ పాఠశాల కార్యదర్శి సై ఫొద్దీన్‌ జాఫర్‌ పరిశీలించారు. భోజనం నాణ్య త ప్రమాణాలను పరిశీ లించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యుడికి సూ చించారు. హెచ్‌ఎం శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, ఉప సర్పంచ్‌ ఎస్‌కే హరీఫ్‌ ఉన్నారు.

బాల్కొండలో క్రికెట్‌

ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలో శనివారం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో శాంభవి క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీనివాస్‌ జట్టుపై రిత్విక్‌ జట్టు విజయం సాధించి కప్‌ సొంతం చేసుకున్నారు. విజేత జట్టుకు శాంభవి హైస్కూల్‌ చైర్మన్‌ మధుసూదన్‌రాజు, కరస్సాండెంట్‌ రవీన్‌ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ ఇంద్రాణి కప్‌ను బహూకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీ సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement