ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

రాష్ట్రస్థాయి పోటీలకు పలువురి ఎంపిక

దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో ఆదివారం ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్‌ ఆర్చరీ పోటీలు ముగిశాయి. పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇండియన్‌ రౌండ్‌ బాలికల విభాగంలో లైలా, ప్రీతి, అంజలి, శ్రావ్య, శ్రీజ, భావన ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో పణీత్‌, రెహాన్‌, రామ్‌చరణ్‌, అరవింద్‌, సోఫియన్‌, స్నేహిత్‌ ఎంపికయ్యారు. రికర్వ్‌ రౌండ్‌ బాలికల విభాగంలో ఇందు, వైష్ణవి, వర్షిత విజయం సాధించారు. బాలుర విభాగంలో అనుదీప్‌, నవీన్‌, అకుల్‌, రుత్విక్‌, హేమంత్‌, నిశిత్‌ కుమార్‌ విజయం సాధించారు. కాంపౌండ్‌ రౌండ్‌ బాలుర విభాగంలో సురేష్‌ చౌదరి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని కొల్లూరు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో వచ్చే నెల 6న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నట్లు కోచ్‌ ప్రతాప్‌దాస్‌ తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు తిర్మల్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, కోచ్‌ ప్రతాప్‌దాస్‌, దోమకొండ గడికోట ట్రస్టు మేనేజర్‌ బాబ్జీ, నిజామాబాద్‌ అర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంజీవ్‌ రెడ్డి, కార్యదర్శి గంగరాజు అభినందించారు.

ఆర్చరీ డిస్ట్రిక్ట్‌ మీట్‌లో గోల్డ్‌ మెడల్‌

వర్ని: మండలంలోని చింతల్‌పేట్‌ గ్రామా నికి చెందిన బర్ధవల్‌ సురేశ్‌చౌదరి ఆర్చరీ డి స్ట్రిక్ట్‌ మీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్‌ సాధించాడు. బోర్గాం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సురేశ్‌చౌదరి కామారెడ్డి జిల్లా దోమకొండలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిస్ట్రిక్ట్‌ మీట్‌లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించడంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి మీట్‌లో పాల్గొననున్నాడు. ఆర్చరీ ఇంటర్నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ రవీందర్‌ సురేశ్‌కు కోచ్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement